జనసేనాని పవన్ కళ్యాణ్ చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పలు విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తమిళనాట హిందీని తమపై రుద్దుతున్నారని హడావిడి చేస్తున్న కొందరి గురించి కామెంట్స్ చేశారు. అంటే పరోక్షంగా తమిళనాడు అంశాన్ని ప్రస్తావించారు. అన్ని దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీ వద్దని అనడం ఎంత వరకు కరెక్ట్. మరి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మనం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. విధ్వంసం చాలా తేలిక. నిర్మించటమే కష్టం అని పవన్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

- March 15, 2025
0
55
Less than a minute
Tags:
You can share this post!
editor