ప్రస్తుతం ‘హిట్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాని. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుంది. ఆ తర్వాత సుజిత్ సినిమా. ఇలా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నాని. ఇంత బిజీలో కూడా ఆయన మరో దర్శకుడి కథకు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఆ దర్శకుడి పేరు విపిన్ దాస్. మలయాళంలో ‘జయ జయ జయ హే’, ‘గురువాయూర్ అంబలనడయిల్’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్. తాజాగా ఆయన చెప్పిన కథ.. నానికి బాగా నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. 2026లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది.

- November 16, 2024
0
39
Less than a minute
Tags:
You can share this post!
administrator