బాలీవుడ్‌ రీమేక్‌ ‘ల‌వ్ టుడే’ సినిమాలో శ్రీదేవి చిన్న కూతురు..

బాలీవుడ్‌ రీమేక్‌ ‘ల‌వ్ టుడే’ సినిమాలో శ్రీదేవి చిన్న కూతురు..

దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇప్ప‌టికే పెద్ద కూతురు జాన్వీకపూర్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా దేవ‌ర‌తో హిట్ కూడా ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీక‌పూర్ కూడా వ‌రుస అవ‌కాశ‌ల‌తో బిజీ అవుతోంది. ‘ది ఆర్చిస్‌’ తో నటిగా తెరంగేట్రం చేసిన ఖుషీ కపూర్ ‘లవ్‌యపా’ అంటూ మ‌రో క్రేజీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అమిర్‌ఖాన్‌ తనయుడు జువైద్‌ ఖాన్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తుండ‌గా.. అద్వైత్ చందన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మిళంతో పాటు తెలుగులో సూప‌ర్ హిట్ అందుకున్న ల‌వ్ టుడే సినిమాని రీమేక్‌గా తీస్తున్నారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ సినిమాను కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్‌. గణేష్‌, కల్పతి ఎస్‌. సురేష్‌తో పాటు ప్రోస్ట్ పాయ సృష్టి బెహల్, భావన తల్వార్, మధు మండేనా సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. ఖుషీ కపూర్, జునైద్ ఖాన్, గ్రుషా కపూర్, అశుతోష్ రాణా తదిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో నటించనున్నారు.

editor

Related Articles