ప్రభాస్ హీరోగా ప్రస్తుతం దర్శకులు మారుతీ అలాగే హను రాఘవపూడి కాంబినేషన్‌లో భారీ సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు కాకుండా తాను చేయనున్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ప్లాన్ చేసిన మాస్ ప్రాజెక్ట్ “స్పిరిట్” కూడా ఒకటి. ఈ సినిమా స్టార్ట్ చేయడం కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అలాగే అప్‌డేట్స్ కోసం కూడా అడుగుతున్నారు. అయితే ఎట్టకేలకి ఇందుకు సమయం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం మేకర్స్ స్పిరిట్ సినిమాని ఈ ఏడాది ఉగాది కానుకగా ముహూర్త కార్యక్రమాలతో మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. సో రెబల్ ఫ్యాన్స్‌కి అప్పటి నుండి ట్రీట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని పాన్ ఆసియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా తీస్తామని నిర్మాతలు అనౌన్స్ చేశారు.

- February 4, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor