మెగాస్టార్ చిరంజీవికి ఉన్న కల్ట్ ఫ్యాన్స్‌లో పాన్ ఇండియా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు. చిరంజీవిని అడ్మైర్ చేసే సందీప్ రెడ్డి వంగ తన అభిమాన హీరో విషయంలో ఎన్నోసార్లు తన ప్రేమని వ్యక్తం చేశాడు. అయితే రీసెంట్‌గా తన నుండి ఒక్క పోస్ట్ మాత్రం మొత్తం సోషల్ మీడియాతో సహా సినీ వర్గాల్లో కూడా ట్రెండింగ్‌గా మారిపోయింది. తమ భద్రకాళి సినిమా ఆఫీస్ నుండి షేర్ చేసుకున్న పిక్‌లో మెగాస్టార్ చిరంజీవి తాలూకా మాస్ ఫ్రేమ్ దెబ్బతో సోషల్ మీడియాలో ఫైర్ మొదలైంది. మరి మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమా నుండి ఒక సీన్‌లో ఫ్రేమ్‌ను సందీప్ వంగ కట్‌చేసి ఫ్రేమ్ కట్టించుకోవడం అనేది ఇతర మెగా అభిమానులని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. దీంతో సందీప్ మెగాస్టార్‌కి ఎలాంటి అభిమాని అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ హై మూమెంట్స్‌ని మించిన హై తమకి కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సెన్సేషనల్ సినిమాని చేసి అందరికీ సమాధానం చెప్పాలని అంటున్నారు. మరి ఈ చిరకాల కోరిక సందీప్, చిరులు తీరుస్తారా లేదా కలిసి పనిచేసి ఒక సినిమా తీస్తే బావుండుననేది ఫ్యాన్స్ కోరిక కూడా ఉంది, వేచి చూడాలి మరి.

- February 4, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor