ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్‌కి రానున్న “గేమ్ ఛేంజర్”..!

ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్‌కి రానున్న “గేమ్ ఛేంజర్”..!

హీరో రామ్ చరణ్ నటించిన సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న అంచనాలు వసూళ్లు పరంగా రీచ్ కాలేదు కానీ చరణ్ నటన సహా ఇతర పలు అంశాలకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా థియేటర్స్‌లో రన్ ఇపుడు పూర్తి చేసేసుకుంది. అయితే ఫైనల్‌గా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ అఫీషియల్‌గా వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ ఫిబ్రవరి నుండి తెలుగు, కన్నడ సహా తమిళ భాషల్లో ఈ ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్‌కి రానున్నట్టుగా అనౌన్స్ చేసేశారు. మరి ఓటిటిలో వచ్చాక ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

editor

Related Articles