హాలీవుడ్ సూపర్ హీరో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న Spider-Man: Brand New Day చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. Tom Holland నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన పోస్టర్లో పీటర్ పార్కర్ తన హూడీ కింద స్పైడర్-మ్యాన్ సూట్‌ను దాచుకుని కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. “ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా… అతడు తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు” అనే కాన్సెప్ట్ పోస్టర్లో హైలైట్‌గా నిలిచింది. నాలుగేళ్ల తర్వాత స్పైడర్ మ్యాన్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్న ఈ చిత్రం పీటర్ పార్కర్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని చూపించనుంది. న్యూయార్క్ నగరాన్ని రక్షించేందుకు మళ్లీ సిద్ధమైన స్పైడర్-మ్యాన్ ఈసారి మరింత శక్తివంతమైన శత్రువును ఎదుర్కొనబోతున్నాడు. ఈ మూవీ 2026 జూలై 31న ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
- May 15, 2026
0
18
Less than a minute
You can share this post!
editor

