Peddi నుంచి మరో పవర్ ఫుల్ అప్డేట్ వచ్చింది. Ram Charan హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కన్నడ స్టార్ Shiva Rajkumar గౌర్ నాయుడు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఇంట్రడక్షన్ వీడియోలో ఆయన కుస్తీ బరిలో పవర్ ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మే 18న ముంబైలో థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో Janhvi Kapoor కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతున్న ‘పెద్ది’ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- May 15, 2026
0
24
Less than a minute
You can share this post!
editor

