Movie Muzz

డైరెక్టర్‌ సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్‌ సినిమా..

డైరెక్టర్‌ సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్‌ సినిమా..

ప్రస్తుతం ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటిస్తున్న సినిమా నిర్మాణ దశలో ఉంది. ఇదిలావుంటే.. తాజాగా నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్‌ ఓ సినిమా చేయనున్నారు. ఆకాష్‌ భాస్కరన్‌ నిర్మాత. ‘అమరన్‌’తో భారీ బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు హీరో శివకార్తికేయన్‌. నిర్మాత మాట్లాడుతూ ‘ఇది మా సంస్థ నుండి వస్తున్న రెండో సినిమా. అలాగే శివకార్తికేయన్‌కి హీరోగా 25వ సినిమా. ఈ మైల్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌కు నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ సుధా కొంగర డైరెక్టర్‌ కావడంతో ఇప్పటికే సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం’ అని తెలిపారు. జయం రవి, అధర్వ, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

administrator

Related Articles