కీరవాణి కొడుకు పెళ్లిలో రాజమౌళి దంపతులు సినిమా పాటకి డ్యాన్స్..

కీరవాణి కొడుకు పెళ్లిలో రాజమౌళి దంపతులు సినిమా పాటకి డ్యాన్స్..

ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి  ఇంట్లో పెళ్లి బాజాలు మోగిన విష‌యం తెలిసిందే. ఆయ‌న చిన్న కుమారుడు మ‌త్తు వ‌ద‌లరా ఫేం శ్రీ సింహా  తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ మనవరాలు రాగ మాగంటిని శ్రీసింహ వివాహం చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లిలో రాజ‌మౌళి దంప‌తులు అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి సినిమాలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాట‌కు స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారింది. అయితే పెళ్లి అనంత‌రం శ్రీ సింహ బారాత్ జ‌రుగ‌గా.. ఈ వేడుక‌లో రాజ‌మౌళి మ‌ళ్లీ త‌న డాన్స్‌తో అల‌రించాడు. ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమాలోని ఆయుధ పూజ పాటకి కీరవాణి పెద్ద కొడుకు కాలా భైర‌వ‌తో క‌లిసి స్టెప్పులేశాడు.

editor

Related Articles