ఇతర భాషా దర్శకులతో కలిసి పనిచేయనున్న Jr NTR..

ఇతర భాషా దర్శకులతో కలిసి పనిచేయనున్న Jr NTR..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్‌ రోషన్‌తో కలిసి బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఆయన ముంబైలోనే ఉన్నారు. Jr NTR తన నట ప్రయాణాన్ని భాషలతో సంబంధం లేకుండా, ఇతర భాషా దర్శకుల మధ్య తన నట ప్రయాణాన్ని సాగిస్తున్నారు తారక్‌. అక్కడ తారక్‌పై దర్శకుడు అయాన్‌ ముఖర్జీ భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో నటిస్తారు తారక్‌. మరోవైపు తారక్‌ కోసం తమిళ దర్శకులు అట్లీ, వెట్రిమారన్‌ కథలు రాసే పనిలో ఉన్నారు. వారితో కూడా తారక్‌ సినిమాలు చేయనున్నట్టు కోలీవుడ్‌ సమాచారం. ప్రస్తుతం తారక్‌ చేయబోయే సినిమాలన్నీ పరభాషా దర్శకులతోనే కావడం విశేషం. తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే ఆ ప్రాజెక్ట్‌కు రెండు మూడేళ్లు పట్టడం ఖాయం. ఆర్‌ఆర్‌ఆర్‌, దేవర చిత్రాల తర్వాత మారిన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పాన్‌ ఇండియా రేంజ్‌ కథలను ఎంచుకుంటూ, అందుకు తగ్గ దర్శకులను ఎన్నుకుంటూ ఓ ప్లాన్‌ ప్రకారం ముందుకెళ్తున్నారు తారక్‌.

editor

Related Articles