రేపే విడుదల ‘సింగిల్‌’

రేపే విడుదల ‘సింగిల్‌’

కెరీర్‌ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. వృత్తిని ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్నా అని చెప్పింది హీరోయిన్ కేతిక శర్మ. ఈ హీరోయిన్ శ్రీవిష్ణుతో కలిసి నటించిన తాజా సినిమా ‘సింగిల్‌’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమాకి కార్తీక్‌రాజు దర్శకుడు. ఈ సందర్భంగా మంగళవారం కేతిక శర్మ విలేకరులతో ముచ్చటించింది. ఈ సినిమాలో తాను పూర్వ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, తను ప్రాక్టికల్‌గా ఆలోచించే స్వతంత్ర భావాలు గల యువతిని అని చెప్పింది. ఆద్యంతం చక్కటి వినోదంతో సాగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని, హృదయాన్ని తాకే ఎమోషన్స్‌ కూడా ఉంటాయని తెలిపింది. శ్రీవిష్ణుతో పనిచేయడం హ్యాపీగా ఉందని, తన కామెడీ టైమింగ్‌ చాలా స్పెషల్‌ అని కేతిక శర్మ పేర్కొంది. సాయిపల్లవి, కీర్తి సురేష్‌ మాదిరిగా పర్‌ఫార్మెన్స్‌ స్కోప్‌ ఉన్న రోల్స్‌ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది. తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికైతే సింగిలే.

editor

Related Articles