సింధూర్ కేవలం సంప్రదాయం కాదు.. అది మా సంకల్పానికి ప్రతీక: మోహ‌న్ లాల్

సింధూర్ కేవలం సంప్రదాయం కాదు.. అది మా సంకల్పానికి ప్రతీక: మోహ‌న్ లాల్

‘ఆపరేషన్‌ సింధూర్‌’  పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే భార‌త సైన్యం చేసిన ఆప‌రేష‌న్‌పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ కూడా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర‌దాడి చ‌ర్య‌కు సంబంధించి భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల‌పై దాడి చేయ‌గా.. ఇందులో 80 మందికి పైగా ఉగ్ర‌వాదులు మ‌రణించిన‌ట్లు స‌మాచారం. అయితే భార‌త సైన్యం చేసిన ఆప‌రేష‌న్‌పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ కూడా ఎక్స్ వేదిక‌గా సింధూరం కేవలం సంప్రదాయం కాదు.. అది మా తిరుగులేని సంకల్పానికి ప్రతీక అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. మేము సింధూరాన్ని కేవలం ఒక సంప్రదాయంగా మాత్రమే ధరించడంలేదు, అది మా తిరుగులేని సంకల్పానికి ప్రతీక. మాపై సవాళ్లు విసరండి, మేము మరింత ధైర్యంగా, మరింత శక్తివంతంగా తిరిగి ఎదుగుతాము. ‘ఆపరేషన్ సింధూర్’లో పాల్గొన్న‌ భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం, సరిహద్దు భద్రతా దళంలోని ప్రతి ధైర్యవంతుడికి మా వందనాలు. మీ ధైర్యం మాకు గర్వకారణం. జై హింద్! #ఆపరేషన్ సింధూర్ అంటూ మోహ‌న్ లాల్ రాసుకొచ్చాడు.

editor

Related Articles