డీజే టిల్లు స్టైల్‌లో సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల ప్రోమో..

డీజే టిల్లు స్టైల్‌లో సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల ప్రోమో..

హీరో రానా దగ్గు బాటి  కాంపౌండ్ నుండి వస్తోన్న టాక్ షో ది రానా దగ్గుబాటి షో. కానీ మీరంతా ఈ షో దేని గురించి అని ఆశ్చర్యపోతున్నారు కదా. నాకూ ఇంకా ఏం తెలియదు.. అంటూ రానా షేర్ చేసిన ఇంట్రో వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సెకండ్‌ ఎపిసోడ్‌ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌. ఈ ఎపిసోడ్‌లో సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల సందడి చేశారు. డీజే టిల్లు స్టైల్‌లో సిద్దు, శ్రీలీల మధ్య వచ్చే ప్రోమో ఫన్‌గా సాగుతూ క్యూరియాసిటీ పెంచుతోంది. సరదా చిట్‌చాట్‌, ఆటపాటలతో ఎపిసోడ్‌ ఉండబోతున్నట్టు ప్రోమో హింట్ ఇచ్చేస్తోంది. ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి మరి. ఫుల్ ఎపిసోడ్‌ శనివారం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫస్ట్‌ ఎపిసోడ్‌లో నాని, తేజ సజ్జా, ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ గెస్టులుగా హాజరయ్యారు. టాక్‌ షో నెక్ట్స్ ఎపిసోడ్స్‌లో నాగచైతన్య, ఎస్‌ఎస్‌ రాజమౌళి, దుల్కర్ సల్మాన్, రాంగోపాల్‌ వర్మ, మీనాక్షి చౌదరి, రిషబ్ శెట్టి లాంటి స్టార్ సెలబ్రిటీలతో సందడి చేయనుంది.

editor

Related Articles