‘ఆపరేషన్ అరుణారెడ్డి’.. నిజాయితీ జర్నలిస్టుల కథ..!

‘ఆపరేషన్ అరుణారెడ్డి’.. నిజాయితీ జర్నలిస్టుల కథ..!

‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమా జర్నలిజం నేపథ్యంతో రూపొందుతున్న ప్రత్యేక కథగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించడం విశేషం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. సమాజంలో నిజాయితీ జర్నలిజం ఎంత ముఖ్యమో, రాజకీయాల్లో ప్రజాసేవ పేరుతో జరిగే మార్పులను ఈ చిత్రం చూపిస్తుంది. ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి పాత్రలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ట్విస్టులతో నిండిన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తిగా ఉంచుతుందని దర్శకుడు తెలిపారు. సమాజానికి మెసేజ్ ఇచ్చే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Related Articles