తేజ సజ్జ సినిమాలో శ్రీయ శరన్..

తేజ సజ్జ సినిమాలో శ్రీయ శరన్..

యువ హీరో తేజ సజ్జ నటించిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రం తర్వాత మరో పెద్ద ప్రాజెక్ట్‌ “మిరాయ్”లో నటిస్తున్నాడు తేజ. రితికా నాయక్ కథానాయిక. ఈగల్ ఫేమ్ యంగ్ అండ్ టాలెంటడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తేజ వారియర్‌గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

            గౌర హరి సంగీత దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీయ శరన్ ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారట. ఏప్రిల్ 18న వేసవిలో 2D, 3D వెర్షన్లలో “మిరాయ్” తెలుగు, హిందీ, తమిళం, కన్నడ,  మలయాళం భాషలలో విడుదల కానుంది.

editor

Related Articles