నాని–శ్రీకాంత్‌ ఓదెల సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్?

నాని–శ్రీకాంత్‌  ఓదెల సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్?

ద‌స‌రా డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల – నాని కాంబోలో మ‌రో సినిమా రాబోతోంది. దసరా పండుగ‌ను పురస్కరించుకుని ఈ సినిమా లాంఛ్ చేయగా, ద‌స‌రా సినిమాను మించే స్థాయిలో ఉంటుంద‌ని క‌థ, క‌థానాల్లో మీరు ఉహించ‌ని స్థాయిలో ఉంటాయ‌ని నాని తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి ఒక న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా ‘స్త్రీ 2’తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న శ్రద్ధాకపూర్ న‌టించ‌బోతున్న‌ట్లు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ మీడియాలోనూ వార్త‌లు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. దసరా – నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియబరుస్తాం.

administrator

Related Articles