సంక్రాంతి రేసులో లేని వెంకీ–అనిల్ రావిపూడి?

సంక్రాంతి రేసులో లేని వెంకీ–అనిల్ రావిపూడి?

 తెలుగు నటుడు వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధించాయి. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మరో చిత్రం 3వ సినిమాగా రాబోతోంది. ఈ సినిమాకి దిల్‌ రాజు నిర్మాత. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ సినిమా కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

సంక్రాంతి రేసు నుండి ఇప్ప‌టికే విశ్వంభ‌ర వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లోకి వెంకీ – అనిల్ రావిపూడి సినిమా కూడా చేరింది. రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్‌ఛేంజ‌ర్ సినిమాను అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌ దిల్‌ రాజు ప్ర‌క‌టించారు. ఆయ‌న నిర్మాణంలోనే వ‌స్తున్న మ‌రో సినిమా వెంకీ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ను మొద‌ట సంక్రాంతికి తీసుకువ‌ద్దాం అనుకున్నారు. కానీ అదే టైంలో దిల్ రాజు సొంత ప్రొడక్ష‌న్ నుండి గేమ్ ఛేంజ‌ర్ వ‌స్తుంది. దీంతో వెంకీ అనిల్ రావిపూడి సినిమాను వాయిదా వేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఈ సినిమా త‌ప్పుకుంటే అటు గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు నాగ చైత‌న్య తండేల్, బాల‌య్య ఎన్‌బీకే 109 సినిమాల‌కు ఇది ప్ల‌స్ పాయింటే. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్లుగా మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తుండగా.. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్ వెంక‌టేశ్ భార్య‌గా న‌టించ‌బోతున్నట్లు తెలుస్తోంది.

administrator

Related Articles