శంకర్ సినిమాలంటే భారీతనానికి, సామాజిక సందేశాలకు పెట్టింది పేరు. 90వ దశకంలోనే దక్షిణాది నుండి పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినీ రంగంలో విమర్శలు సాధారణమేనని, వాటిని సవాలుగా తీసుకుని తదుపరి సినిమాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని శంకర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బయోపిక్ సినిమా తీయాల్సివస్తే తాను రజనీకాంత్ జీవిత చరిత్రను వెండితెరకు ఎక్కిస్తానని ఆయన చెప్పారు. ‘నాకు ప్రస్తుతానికైతే బయోపిక్ తీయాలనే ఆలోచన లేదు. తీస్తే తప్పకుండా రజనీ సర్ సినిమా తీసి తీరుతాను. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే రజనీకాంత్ జీవిత చరిత్రనే తీస్తాను. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం’ అవుతుందని శంకర్ తెలిపారు. తర్వాత ‘భారతీయుడు-3’ సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెడతానని ఆయన వెల్లడించారు.

- January 10, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor