అల్లరి నరేష్ బచ్చలమల్లిని అమెజాన్ ప్రైం వీడియోలో చూడొచ్చు..

అల్లరి నరేష్ బచ్చలమల్లిని అమెజాన్  ప్రైం  వీడియోలో చూడొచ్చు..

ఇటీవలే బచ్చలమల్లి  సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లరి నరేష్. డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌తో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ ఫిమేల్‌ లీడ్ రోల్‌లో నటించింది. రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్ వన్ మ్యాన్ షోలా సాగే ఈ సినిమాను థియేటర్లలో మిస్సయిన వారి కోసం అమెజాన్ ప్రైం వీడియోలో చూడొచ్చు. మరి ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందో వేచి చూడాలి. రాజేష్ దండా, బాలాజీ గుప్తా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం సమకూర్చారు. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్‌, రోహిణి, అచ్యుత్‌ కుమార్‌, బలగం జయరాం ఇతర కీలక పాత్రలు పోషించారు.

editor

Related Articles