హీరో బాలకృష్ణ కాంపౌండ్ నుండి వస్తోన్న సినిమా డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఎన్‌బీకే 109 గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. డాకు మహారాజ్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. విడుదలకు ఇంకా రెండు రోజులే గేప్ ఉండటంతో టికెట్ బుకింగ్ అప్‌డేట్ వచ్చేసింది. డాకు మహారాజ్ టికెట్ బుకింగ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో టికెట్ బుకింగ్స్ ఈ రోజే ప్రారంభమయ్యాయి. పరిమిత షోలతో బుకింగ్స్ మొదలైన గంటలోనే లక్షా 56 వేలకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. బాలకృష్ణ సినిమాకు క్రేజ్ ఎలా ఉందో ఈ బుకింగ్స్ బట్టే తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. రోనిత్ రాయ్, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

- January 10, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor