లోకల్ టీవిలో “గేమ్ ఛేంజర్” ప్రసారం..!

లోకల్ టీవిలో “గేమ్ ఛేంజర్” ప్రసారం..!

హీరో రామ్‌చరణ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా “గేమ్ ఛేంజర్” గురించి తెలిసిందే. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుటి నుండో తీస్తూ ఎట్టకేలకి ఈ సంక్రాంతికి విడుదల చేశారు. కానీ ఈ సినిమాపై భారీ ఎత్తున జరిగిన నెగిటివ్ ప్రచారం మాత్రం బాగా దెబ్బతీసింది. రిలీజ్‌కి ముందే సినిమా యూనిట్‌కి వచ్చిన బెదిరింపులు అలాగే రిలీజ్ అయిన రోజే ఆన్లైన్‌లో సినిమా పైరసీ అది కూడా ఫుల్ క్లారిటీ ప్రింట్ దర్శనం ఇవ్వడంతో బయట జనం చూడడం స్టార్ట్ చేశారు. ఇక ఇది చాలదు అన్నట్టుగా సినిమాని ఏకంగా లోకల్ టీవీ ఛానెల్లో ప్రసారం చేయడం అనేది మరో దెబ్బగా మారింది. ఈ కేసులో పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. సినిమాని ప్రసారం చేసిన అప్పలరాజు అనే వ్యక్తిని గాజువాకలో ఉన్నట్టుగా గుర్తించి అక్కడ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. టీవిలో ప్రసారం చేసేసిన అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.

editor

Related Articles