తెలంగాణ వాస్తవ సంఘటనల ఆధారంగా ‘సర్కారు బాయి’..

తెలంగాణ వాస్తవ సంఘటనల ఆధారంగా ‘సర్కారు బాయి’..

తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తుండగా, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో 1980ల కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నీటి హక్కు, సామాజిక సమానత్వం, కుల వివక్ష వ్యతిరేక పోరాటం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

Related Articles