‘నువ్వే కదా..’ అంటూ ఆకట్టుకుంటున్న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.

‘నువ్వే కదా..’ అంటూ ఆకట్టుకుంటున్న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘టా టా’ పాటకు మంచి స్పందన లభించగా, తాజాగా చిత్ర బృందం ‘నువ్వే కదా..’ అనే మెలోడీ సాంగ్‌ను ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లో విడుదల చేసింది.

కళ్యాణ్ నాయక్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, పీవీఎన్‌ఎస్ రోహిత్, హరిణి ఇవటూరి ఆలపించారు. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, అనుబంధాలను ప్రతిబింబించేలా ఈ పాట రూపొందింది. చాలా కాలం తర్వాత వడ్డే నవీన్ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మంచి కథా చిత్రాలను అందించాలనే లక్ష్యంతో స్థాపించిన వడ్డే క్రియేషన్స్ నుంచి వస్తున్న తొలి చిత్రంగా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Related Articles