“నన్ను హీరో చేయాలన్నది మా నాన్న కల”

“నన్ను హీరో చేయాలన్నది మా నాన్న కల”

‘పురుష:’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న పవన్ కళ్యాణ్ బత్తుల తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహించారు. మాచర్ల సమీపంలోని కారంపూడికి చెందిన పవన్ కళ్యాణ్‌కు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని తెలిపారు. తనను హీరోగా చూడాలన్నది తండ్రి కల అని, అందుకే సినిమాల్లోకి వచ్చానన్నారు. వైజాగ్‌లో ప్రముఖ యాక్టింగ్ కోచ్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్నానని చెప్పారు. ‘పురుష:’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని, ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ వంటి సీనియర్ నటులు ఎంతో సహకరించారని చెప్పారు. తన సోదరి సరస్వతి ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని భావోద్వేగంగా వెల్లడించారు. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles