టాలీవుడ్ హాస్య నటుడు సప్తగిరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ మంగళవారం (ఏప్రిల్ 8) నాడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ మేరకు సప్తగిరి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తన తల్లి అంతిమ సంస్కారాలు బుధవారం తిరుపతిలో జరగనున్నట్లు తెలిపారు. సప్తగిరికి ఈ ఘటన తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- April 9, 2025
0
5
Less than a minute
Tags:
You can share this post!
editor