సాయి అభయంకర్ ‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్‌గా పాకింది. దాంతో ఆయన తాజా సినిమాకోసం అభిమానులేకాక, సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఆయన బర్త్‌డే కానుకగా కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ చేయబోతుండగా.. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్స్‌పై చిత్రీకరించిన ఓ వీడియోను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ‘A22 x A6’గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం 20 ఏళ్ల కుర్రాడిని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళంలో తన పాటలతో పాప్ వైబ్ తీసుకువచ్చిన సాయి అభయంకర్. గతేడాది యూట్యూబ్‌లో వైరల్ అయిన ఇండియన్ పాటలలో తమిళం నుండి వచ్చిన ‘ కచ్చిసేరా’ , ‘ ఆసై కూడా’ పాటలు సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. అయితే ఈ పాటలని కంపోజ్ చేయడంతో పాటు అందులో నటించాడు సాయి అభయంకర్. తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడి అలరించిన సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి.

- April 9, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor