మంచు కుటుంబంలో మళ్లీ వివాదాలు తలెత్తాయి. కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉంటూ వచ్చిన మంచు మనోజ్, మంచు విష్ణు సోదరులు తాజాగా మరో వివాదానికి దారి తీశారు. తన అన్న మంచు విష్ణు 150 మంది వ్యక్తులతో కలిసి వచ్చి అక్రమంగా జల్‌పల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లోకి చొరబడి ఆస్తినాశనం చేశారని మనోజ్ ఆరోపించారు. ఇంట్లోకి ప్రవేశించి బట్టలు, వస్తువులు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. తాను ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకుని విష్ణు ఈ చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పించారు. అక్కడ ఉన్న రెండు కార్లను టోయింగ్ వాహనంతో తీసుకెళ్లి రోడ్డుపై వదిలేశారని తెలిపాడు.

- April 9, 2025
0
7
Less than a minute
You can share this post!
editor