సమంత నిర్మాతగా రెండో సినిమా స్టార్ట్..

సమంత నిర్మాతగా రెండో సినిమా స్టార్ట్..

హీరోయిన్ సమంత ట్రాలాల పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ పేరుతో తొలి చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తోంది. ‘సినిమాబండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా యాక్ట్ చేయనుంది. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాని తీస్తున్నారు. ఇప్పటికే రెండు వారాల పాటు షూటింగ్‌ జరిగిందని, తదుపరి షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్‌-హనీ బన్ని’ సిరీస్‌ నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

administrator

Related Articles