‘క’ సినిమా ఫెయిల్ అయిన పక్షంలో ఇక సినిమాలను చేయను..

‘క’ సినిమా ఫెయిల్ అయిన పక్షంలో ఇక సినిమాలను చేయను..

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా ‘క’ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సందీప్, సుజిత్‌లు కలిసి డైరెక్ట్ చేస్తుండగా ఓ థ్రిల్లర్ సినిమాగా ఇది తెరకెక్కింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఓ ఇంట్రెస్టింగ్ గెటప్‌లో (పోస్ట్‌మేన్) కనిపిస్తూ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చేసిన ఊరిలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడడం ఒక విశేషం. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌కు అక్కినేని నాగచైతన్య గెస్టుగా వచ్చారు. ఈ వేడుకలో హీరో కిరణ్ అబ్బవరం స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్‌లో ‘క’ మూవీపై తన కాన్ఫిడెన్స్ ఏమిటో కూడా చూపెట్టాడు. ‘క’ మూవీ ప్రేక్షకులకు నచ్చకుండా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే.. తాను సినిమాలు చేయడం మానేస్తానని అన్న కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31 (గురువారం)న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైంది.

administrator

Related Articles