సమంత నటించిన స్పై థ్రిల్లర్ వెబ్‌సిరాస్ ‘సిటడెల్ : హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్ OTTలో అధిక వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు కూడా ఈ సిరీస్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఏజెంట్ హనీగా ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం కొంత విరామం తర్వాత, “రక్త్ బ్రహ్మాండ్ -ద బ్లడీ కింగ్‌డమ్” అనే సిరీస్ కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టారు సమంత. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా, “మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశా” అని పోస్ట్ చేశారు.
ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఆదిత్యరాయ్ కపూర్, ఆలీ ఫాజల్, వామికా గబ్బీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2018లో విడుదలైన హారర్ చిత్రం ‘తుమ్‌బాడ్’తో గుర్తింపు తెచ్చుకున్న అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యాంటసీ వెబ్‌సిరీస్‌ను రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నారు.