రణ్‌బీర్‌ కపూర్‌ యానిమల్‌ 3పై క్లారిటీ ఇచ్చాడు..!

రణ్‌బీర్‌ కపూర్‌ యానిమల్‌ 3పై క్లారిటీ ఇచ్చాడు..!

అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్‌, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన సందీప్‌ రెడ్డి వంగా బీటౌన్ యాక్టర్ రణ్‌బీర్‌ కపూర్‌తో యానిమల్‌ సీక్వెల్‌ యానిమల్ పార్క్‌ కూడా చేయబోతున్నాడని తెలిసిందే. తక్కువ టైంలోనే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా సూపర్ క్రేజ్‌తోపాటు కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న టాలీవుడ్‌ దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు సందీప్ రెడ్డి వంగా.

ఈ ప్రాంఛైజీలో మూడో పార్టు కూడా ఉండబోతుందన్న వార్త ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సీక్వెల్‌ 2027లో మొదలవుతుందని చెప్పిన రణ్‌ బీర్ కపూర్‌ .. ఆ తర్వాత యానిమల్ 3కు సంబంధించి ప్రొడక్షన్‌ పనులు త్వరగా ప్రారంభించడంపై ఫోకస్ పెడతానని చెప్పాడు. థర్డ్‌ పార్ట్‌ చేయాలనే ఆలోచన మొదటి నుండే ఉందని.. యానిమల్‌ విజయం సాధించడంతో అది ధృడమైన నిర్ణయంగా మారిందని చెప్పుకొచ్చాడు రణ్‌బీర్‌కపూర్‌. సందీప్‌ రెడ్డి వంగాను ఒరిజినల్ డైరెక్టర్‌గా సంబోధించే రణ్‌బీర్‌.. ఈ క్రేజీ డైరెక్టర్‌తో ప్రాంఛైజీ సినిమాలు చేయడంపై ఎక్జయిటింగ్‌గా ఉన్నాడు.

editor

Related Articles