స్టార్ బ్యూటీ సమంత, టాలీవుడ్ దర్శకురాలు నందినిరెడ్డితో మళ్లీ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జోడీ మళ్లీ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. సమంత సొంత ప్రొడక్షన్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా రీమేక్ కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్‌తో రూపొందనుందని నందిని రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- March 11, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor