‘ఆర్‌ఆర్‌ఆర్’తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు తారక్. అందుకే సినిమాల సెలక్షన్‌లో కూడా ఆచితూచి ముందుకెళ్తున్నారాయన. పూర్తిస్థాయి బాలీవుడ్ సినిమా ‘వార్ 2’లో ఆయన నటించడానికి కారణం కూడా అదే. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతున్నారు తారక్. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే ‘వార్ 2’ విడుదల కానుంది. ఇటీవలే ప్రశాంత్‌నీల్ ‘డ్రాగన్’ షూటింగ్ కూడా మొదలైంది. ఇదిలావుంటే.. ఈ రెండు సినిమాల తర్వాత తారక్ చేయబోయే సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘డ్రాగన్’ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు ‘రాక్’ టైటిల్‌ని కూడా నెల్సన్ ఖరారు చేశారట. పాన్ ఇండియా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొనే నెల్సన్ ఈ టైటిల్ పెట్టారని ఫిల్మ్ వర్గాల టాక్. తారక్ ‘డ్రాగన్’, నెల్సన్ ‘జైలర్ 2’ పూర్తయ్యాక ‘రాక్’ మొదలవుతుంట. 2026లో సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

- March 11, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor