లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి చంపేస్తాం అనే బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్ తన గెలాక్సీ అపార్ట్‌మెంట్ భద్రతను బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో కవర్ చేయించాడు. సల్మాన్ ఖాన్ ముంబై ఇంటిని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో కప్పి వేయించాడు. బాబా సిద్ధిక్ హత్య తర్వాత నటుడి భద్రతను పెంచారు. అతనికి Y- ప్లస్ భద్రత, పోలీసు ఎస్కార్ట్ వాహనం అందించబడింది. హీరో సల్మాన్ ఖాన్ తన ముంబై నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద భద్రతను పెంచారు. అతని ఇల్లు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో ప్రొటెక్ట్ చేయబడింది, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో బలోపేతం చేయబడింది. అప్‌గ్రేడ్ చేసిన సెక్యూరిటీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఫ్రెండ్, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య తర్వాత 59 ఏళ్ల హీరో భద్రతను పెంచారు. సల్మాన్ ఇల్లు నీలిరంగు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో కప్పబడి ఉన్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. కొంతమంది కార్మికులు హీరో నివాసంలో గాజు అద్దాలను అమర్చడం కనిపించింది.

- January 7, 2025
0
9
Less than a minute
You can share this post!
editor