అడివిశేష్ జీ2 మిషన్‌లో జాయిన్ అయిన బేబిజాన్ నటి..

అడివిశేష్ జీ2 మిషన్‌లో జాయిన్ అయిన బేబిజాన్ నటి..

టాలీవుడ్‌ యాక్టర్ అడివిశేష్ కెరీర్‌లో వన్ ఆఫ్‌ ది బెస్ట్‌ సినిమాగా నిలిచిపోతుంది. టైటిల్‌ రోల్‌ పోషించిన గూడఛారి. ఈ ప్రాంఛైజీలో జీ2 కూడా వస్తుందని తెలిసిందే. మేజర్ సినిమాకి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌ కుమార్‌ సిరిగినీడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా గన్స్‌ యాక్షన్‌ మూడ్‌లోకి దిగితే.. అంటూ ఇప్పటికే సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీంలోకి బేబిజాన్ హీరోయిన్ వామికా గబ్బి జాయిన్ అయ్యింది. మిషన్‌లో భాగంగా సూట్‌లో ఉన్న అడివిశేష్‌, వామికా ఈఫిల్‌ టవర్‌ ముందు కనిపిస్తుండటం తాజా లుక్‌లో చూడొచ్చు. అడివి శేష్‌ను సీక్వెల్‌లో స్టైలిష్‌ యాక్షన్‌ అవతార్‌లో చూపించబోతున్నట్టు ప్రీ వెర్షన్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోతో హింట్‌ ఇచ్చేశాడు డైరెక్టర్‌. ఈ సినిమాకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. జీ2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

editor

Related Articles