అతిథి పాత్రల్లో సందడి చేయనున్న సల్మాన్‌, సంజయ్‌

అతిథి పాత్రల్లో సందడి చేయనున్న సల్మాన్‌, సంజయ్‌

సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్‌ హీరోలు సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌దత్‌ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. ఒక హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కోసం ఈ బాలీవుడ్‌ స్టార్స్‌ ఇద్దరూ ముందుకొచ్చారు. హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌, సంజయ్‌ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. సౌదీ అరేబియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఈ హీరోలిద్దరూ జాయిన్‌ అయ్యారు. ఈ నెలాఖరు వరకు ఈ షూటింగ్‌ జరుగుతుందని తెలిసింది. భద్రతా కారణాల రీత్యా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడించలేమని నిర్మాతలు తెలిపారు. మిడిల్‌ ఈస్ట్‌లో జరిగే అమెరికన్‌ థ్రిల్లర్‌ కథాంశమిదని, అక్కడ సల్మాన్‌ఖాన్‌, సంజయ్‌దత్‌లకు ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా వారిద్దరిని కీలకమైన అతిథి పాత్రల్లో ఎంపిక చేశారని తెలిసింది.

editor

Related Articles