షూటింగ్‌కై తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా…

షూటింగ్‌కై తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా…

ప్రియాంక చోప్రా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్‌, రాజమౌళి సినిమా షూటింగ్‌ మంగళవారం నుండి హైదరాబాద్‌లో మొదలుకానున్నదని సమాచారం. అందులో భాగం కావడానికే ప్రియాంక హైదరాబాద్‌ చేరుకున్నారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఓసారి ఈ సినిమా షూటింగ్‌లో ప్రియాంక పాల్గొన్నదట. మహేష్‌, ప్రియాంకలపై కొన్ని చిన్న చిన్న సీన్స్‌ రాజమౌళి తీశారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్‌, ప్రియాంకలపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి షూటింగ్‌ ఏప్రిల్‌ నుండి కెన్యా అడవుల్లో మొదలుకానున్నది. వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌లో నానా పటేకర్‌, మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ఏ అధికారిక ప్రకటనా రాజమౌళి నుండి రాకపోవడం గమనార్హం.

editor

Related Articles