సైఫ్ అలీఖాన్ నేడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్: డాక్టర్

సైఫ్ అలీఖాన్ నేడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్: డాక్టర్

హీరో సైఫ్ అలీఖాన్ జనవరి 21న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. బాంద్రాలోని తన ఇంట్లో చోరీకి పాల్పడే సమయంలో దుండగుడి బారిన పడి కత్తిపోట్లకు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ మంగళవారం డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆసుపత్రికి చెందిన ఒక డాక్టర్ ఈ విషయాన్ని తెలిపారు. గురువారం కత్తిపోట్లకు గురైన సైఫ్ ఆసుపత్రిలో చేరారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే ఉదయం అదే విషయాన్ని ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిన్న రాత్రి డిశ్చార్జ్ కోసం పత్రాలు దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 10-12 గంటల వరకు హీరో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

editor

Related Articles