హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటిస్తున్న తాజా సినిమా ఛాంపియన్. రోషన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగేళ్లు అవుతోంది. నిర్మాత కాన్వెంట్, పెళ్లిసందD లాంటి సినిమాలతో అలరించిన రోషన్ ఆ తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు. అయితే చాలారోజుల తర్వాత రోషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు రోషన్ బర్త్‌డే కానుకగా సినిమా నుండి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో చూస్తుంటే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.

- March 13, 2025
0
51
Less than a minute
Tags:
You can share this post!
editor