‘లెనిన్’ అనే పేరుతో హీరో అఖిల్  సినిమా..

‘లెనిన్’ అనే పేరుతో హీరో అఖిల్  సినిమా..

హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల అఖిల్ అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమాను ‘లెనిన్’ అనే టైటిల్‌తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్‌ను ఏకధాటిగా 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని.. దీంతోనే సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఫారిన్ లొకేషన్లకు ప్రాధాన్యత లేకుండా లోకల్‌లోనే ఈ సినిమాను రూపొందించనున్నారట. ఇక ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందట. ఈ సినిమా యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

editor

Related Articles