మోడీకి చెప్పాక ఏమైందో చూశారుగా అంటూ ఆర్జీవి ట్వీట్

మోడీకి చెప్పాక ఏమైందో  చూశారుగా అంటూ ఆర్జీవి ట్వీట్

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భార‌తీయులు అంద‌రూ ర‌గిలిపోయారు. ఉగ్రమూకలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాల‌ని డిమాండ్ చేశారు. దీంతో భార‌త సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట భారత్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపై భీకర దాడులు నిర్వహించింది. కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి కచ్చిత లక్ష్యంతో వైమానిక దాడులు నిర్వహించింది. దీనిపై భార‌తీయులు అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే పహల్గాం ఉగ్రదాడి ఘటన సమయంలో ఉగ్రవాదులు టూరిస్టు మహిళల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వారి క‌ళ్ల ముందే భ‌ర్త‌ల‌ని ఎంతో కిరాత‌కంగా చంపేశారు. మోదీకి ఓట్లు వేసి గెలిపించారుగా.. పోయి చెప్పు అని ఆ టెర్ర‌రిస్టులు భారత మహిళలతో అన్నారు. మరోవైపు చనిపోయిన భర్త పక్కన దీనంగా కూర్చుని ఏడుస్తున్న మహిళ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ పిక్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. అయితే ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత ఇప్పుడు ఒక ఫొటో వైర‌ల్ అవుతోంది. ఆ ఫొటోలో టెర్రరిస్టులు మోదీకి చెప్పు అని ఓ వైపు ఉంటే.. మరోవైపు మోదీకి చెప్పాను అని ఓ మహిళ కోపంతో ఉగ్రమూకల శవాల మధ్య నిల్చొని ఉండ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అయితే ఇదే స్టైల్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఆప‌రేష‌న్ సింధూర్‌పై ఓ ట్వీట్ పెట్టారు.

editor

Related Articles