RGV కి ఏపీ హైకోర్టులో ఊరట..

RGV కి ఏపీ హైకోర్టులో ఊరట..

ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన అంశంలో టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మపై కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశాడని తెలిసిందే. తాజాగా ఈ కేసులో రాంగోపాల్‌ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం (ఈ నెల 9)వరకు వరకు అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

editor

Related Articles