ధనుష్ హీరోగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘కర’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని డా. ఐషరి కె. గణేష్ నిర్మించగా, తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్లపై విడుదల చేశారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.4.8 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. రైతులు ఎదుర్కొనే సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు విఘ్నేశ్ రాజా ఈ సినిమాను రూపొందించారు. ధనుష్ ‘కరసామి’ పాత్రలో అద్భుత నటన కనబరిచారు. మమితా బైజు నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘కర’ ప్రేక్షకులను అలరిస్తోంది.
- May 7, 2026
0
6
Less than a minute
You can share this post!
editor

