ప్రముఖ సంగీత దర్శకుడు, ఏ.ఆర్ రెహమాన్ సైరా బాను దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుండి విడిపోతున్నట్లు రెహమాన్ టీమ్‌లోని బాసిస్ట్ మోహిని డే వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఆమె రెహమన్ ట్రూప్‌లో కొనసాగుతున్నారు. అయితే రెహమాన్, మోహిని డే ఒకేరోజు విడాకులు ప్రకటించడంతో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని అందుకే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్‌పై మోహిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. నేను విడాకులు ప్రకటించిన అనంతరం నుండి మీ ఇంటర్వ్యూ కావాలని నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దయచేసి నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి అంటూ మోహిని డే చెప్పుకొచ్చింది. మరోవైపు ఇదే విషయంపై రెహమాన్ భార్య సైరా తరఫు న్యాయవాది వందనా షా కూడా స్పందిస్తూ.. ఈ రూమార్స్‌లో ఎలాంటి నిజం లేదని క్లారిటీగా చెప్పారు.
- November 23, 2024
0
151
Less than a minute
You can share this post!
editor


