బిగ్ బాస్ బ్యూటీ సోనియా సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్..

బిగ్ బాస్ బ్యూటీ సోనియా సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్..

తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ సోనియా ఆకుల పెళ్లి పీట‌లు ఎక్క‌బోతోంది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకోగా.. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తన ప్రియుడు యష్ పాల్‌తో సోనియా గురువారం నిశ్చితార్థం చేసుకుంది. అయితే య‌ష్‌కి ఇది రెండో పెళ్లి అని తెలుస్తోంది. యష్‌కు ఇప్పటికే పెళ్లి అవ్వ‌గా.. తన భార్యకు విడాకులు ఇచ్చి సోనియాతో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని మంథ‌నికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపుతోనే బిగ్‌బాస్ సీజ‌న్ 8లో హౌస్‌లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ అయితే ఆమెకి విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో హౌస్ నుండి నాలుగో వారమే ఇంటికి వెళ్లిపోయింది.

editor

Related Articles