సుధా కొంగర డైరెక్షన్‌లో-తమిళ హీరో శివకార్తికేయన్‌తో సినిమా

సుధా కొంగర డైరెక్షన్‌లో-తమిళ హీరో శివకార్తికేయన్‌తో సినిమా

‘అమరన్‌’తో భారీ విజయాన్ని అందుకున్నారు తమిళ హీరో శివకార్తికేయన్‌. ఇప్పటికే ఈ సినిమా రూ.300 కోట్ల మార్కును దాటి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాతో శివకార్తికేయన్‌ క్రేజ్‌ కూడా పానిండియా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. దీంతో శివకార్తికేయన్‌ నెక్ట్స్‌ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ని అందుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నెక్ట్స్‌ సినిమా చేయనున్నారు. ‘పురాణనూరు’ అనే ఓ సోషియో పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథను ఈ సినిమాకోసం ఆమె సిద్ధం చేశారు. శ్రీలీల కథానాయికగా ఎంపికయ్యారు. ఇదిలావుంటే.. కథ రీత్యా ఇందులో రెండు కీలక పాత్రలున్నాయట. అందులో ఒకటి విలన్‌ తరహా పాత్ర అట. హీరోలు చేస్తేనే వాటికి న్యాయం జరుగుతుందట. ఈ క్రమంలోనే ‘జయం’రవిని ఆమె కలిశారట. ఆయన ఓకే చెప్పారనేది చెన్నై టాక్‌.

editor

Related Articles