టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ల బాటలోనే రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మాస్ హీరో ఏషియన్ సంస్థతో కలిసి ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమాతో ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించగా.. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని ప్రజలకు నేటి నుండి ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. 6 స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేశారు రవితేజ.

- July 31, 2025
0
67
Less than a minute
Tags:
You can share this post!
editor