ఫ్యామిలీ కథలో యాక్టింగ్‌ చేసేందుకు ఓకే చెప్పిన రవితేజ..?

ఫ్యామిలీ కథలో యాక్టింగ్‌ చేసేందుకు ఓకే చెప్పిన రవితేజ..?

హీరో రవితేజ గత కొంతకాలంగా వరుసగా మాస్‌, యాక్షన్‌ కథలతోనే సినిమాలు చేస్తున్నారు. ఆయన నుండి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వచ్చి చాలా ఏళ్లయింది. తాజా సమాచారం ప్రకారం ఆయన పూరిస్థాయి కుటుంబ కథా చిత్రానికి ఓకే చెప్పారని తెలిసింది. దీనికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తారని సమాచారం. బీవీఎస్‌ రవి కథ సమకూర్చుతున్నారని తెలిసింది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి చిత్రాలతో కిషోర్‌ తిరుమల ఫీల్‌గుడ్‌ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రవితేజ సినిమా కోసం వినోదాత్మకంగా సాగే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటుంటుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘మాస్‌ జాతర’ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

editor

Related Articles