మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అడపాదడపా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటారు. సందర్భానుసారంగా ఆయన చేసే ట్వీట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు ఉమెన్స్ డే కనుక సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా పేజ్‌లో తన సతీమణి, అలనాటి అందాల హీరోయిన్స్‌తో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు. దానికి కామెంట్‌గా తన నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని పంచుకుని విజయాన్ని అందించిన హీరోయిన్స్‌కి, యావన్మంది మహిళలకు చేతులుఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. చిరు షేర్ చేసిన ఫొటోలో ఆయన సతీమణి సురేఖతో పాటు ఆయనతో కలిసి నటించిన రాధిక, టబు, నదియా, జయసుధ, మీనా, సుహాసిని, కుష్బూ ఉన్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక చిరంజీవి తన తల్లి, చెల్లెలు, తమ్ముడు నాగబాబుతో కలిసి మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రోమో ఇప్పటికే విడుదల చేశారు.
- March 8, 2025
0
173
Less than a minute
Tags:
You can share this post!
administrator

